మనదేశంలో ఎన్నో వింత సంప్రదాయాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాలను పూర్వకాలం నుంచి యథాతధంగా పాటిస్తూ వస్తుంటారు. అలాంటి వాటిల్లో జరుడుకాలనీ గ్రామదేవత జాతర ఉత్సవం ఒకటి. ఈ ఉత్సవాన్ని 10 రోజులపాటు నిర్వహిస్తారు. సీతంపేట మండలంలోని జరుడుకాలనీ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని చెప్పి గ్రామదేవతకు పూజలు నిర్వహిస్తారు. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14 వ తేదీ వరకు మొత్తం 10 రోజులపాటు ఈ జాతరను నిర్వహిస్తారు.
Read: రీసెంట్ స్టడీ: డెల్టా వేరియంట్ కంటే 4.2 రెట్లు వేగంగా…
ఈ పదిరోజులపాటు గ్రామంలోని ఇతరులు ఎవరినీ అనుమతించరు. ఈ ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజున గ్రామ శివారులోని సుందమ్మకు, రెండో రోజున గ్రామంలోని అమ్మవారికి, మూడో రోజున పితృదేవతలకు చెల్లించాల్సిన మొక్కులు చెల్లిస్తారు. యజ్జరోడు, దీసరోడు, జన్నోడులు వంటివారు ప్రత్యేక మంత్రాలు చదువుతూ పూజలు చేస్తారు. ఇలాంటి ఆచారం ప్రాచీన కాలం నుంచి వస్తుందని, ఈ ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.