ఇంటర్నెట్ ప్రపంచంలో ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇంట్లో వంటలు వండుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. యూప్ ఒపెన్ చేసి కావాల్సినవి తెప్పించుకొని తింటున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఫుడ్ పాయింట్స్ నుంచి 10 లేదంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వారికి డెలివరీ బాయ్స్ ఫుడ్‌ను డెలివరి చేస్తుంటారు. 248 మైళ్ల దూరంలో ఉండే వారికి ఫుడ్ డెలివరి చేయమంటే చేస్తారా? భూమిపై కాకుండా ఆకాశంలో 248 మైళ్ల దూరంలో ఉన్న వారికి ఫుడ్ డెలివరీ చేయడమంటే చాలా కష్టం. కష్టం అనేకంటే అసాధ్యమని చెప్పాలి.
Read: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణాలు ఇవే…
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఈట్స్ ఉబెర్. అంతరిక్ష కేంద్రానికి ఈట్స్ ఉబెర్ ఫుడ్‌ను డెలివరి చేసింది. జపాన్‌కు చెందిన బిలినియర్ మెజ్వానా ఈ ఫుడ్‌ను డెలివరీ చేశాడు. డిసెంబర్ 11 వ తేదీన మెజ్వానా అంతరిక్ష కేంద్రానికి వెళ్లి ఈ ఫుడ్‌ను డెలివరీ చేశాడు. 12 రోజులపాటు ఆయన అంతరిక్ష కేంద్రంలోని ఆర్బిట్‌లో ప్రయాణం చేయనున్నాడు. ఈట్స్ ఉబెర్ ఫుడ్‌ను డెలివరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.