NTV Telugu Site icon

బొద్దింక‌ల‌తో బీర్‌… అక్క‌డ యమా డిమాండ్‌…

బీరును దేనితో త‌యారు చేస్తారు అంటే బార్లీ గింజ‌ల‌తో త‌యారు చేస్తార‌ని చెప్తారు.  అలా త‌యారు చేసిన బీరుకు డిమాండ్ ఉంటుంది.  అయితే, ఆ దేశంలో త‌యారు చేసే బీరు మాత్రం అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది.  బీరును మామూలు వాటితో కాకుండా బొద్దింక‌ల‌తో త‌యారు చేస్తార‌ట‌.  న‌మ్మ‌స‌క్యంగా లేక‌పోయినా ఇది నిజం.  బొద్దింక‌ల‌ను ఉడ‌క‌బెట్టి, వాటినుంచి ర‌సం తీసి, ఆ ర‌సంతో త‌యారు చేసిన బీరును త‌యారు చేస్తారు.  ఇలా త‌యారు చేసిన బీరుకు ఆ దేశంలో య‌మా డిమాండ్ ఉన్న‌ది.  

Read: పెళ్లి ఊరేగింపులో అప‌శృతి: గుర్ర‌పు బోగీలో మంట‌లు… క్ష‌ణాల వ్య‌వ‌ధిలో…

ఇలా స్పెష‌ల్‌గా త‌యారు చేసే బీర్ కావాలంటే జ‌పాన్ వ‌ర‌కు వెళ్లాల్సిందే. ఈ బీర్ కోసం తైవాన్ నుంచి మ‌గ బొద్దింక‌ల‌ను తెప్పిస్తార‌ట‌.  ఇలాంటి బొద్దింక‌లు నీళ్ల‌ల్లో ఉండే కీట‌కాల‌ను, చిన్న చిన్న చేప‌ల‌ను తిని జీవ‌నం సాగిస్తుంటాయి.  ఆ బొద్దింక‌ల‌ను కొన్ని రోజుల పాటు నీళ్ల‌ల్లో ఉడికిస్తారు.  అలా ఉడికించ‌గా వ‌చ్చిన ర‌సంతో క‌బుటోకామా అనే జ‌పాన్ ప్రాసేస్‌తో బీరును త‌యారు చేస్తారు.  ఈబీరుకు జ‌పాన్‌లో భారీ డిమాండ్ ఉంటుంది.  దీనిని తీసుకోవ‌డం వ‌ల‌న ఎక్కువ‌కాలం ఆరోగ్యంగా జీవిస్తార‌ని వారి న‌మ్మ‌కం.