పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి చెక్ పెట్టే పనిలో పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికలో టీడీపి జనసేన మధ్య పొత్తు కుదిరింది. టీడీపీ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఆచంట నియోజకవర్గంలో అప్రజాస్వామిక పరిపాలన నడుస్తోందని, దానిని సరి చేసేందుకు పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికల్లో పెనుగొండ జనసేన అభ్యర్థికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.
వైస్సార్సీపీ పార్టీకి చెక్ పెట్టడానికి.. ప్రజా స్వామ్య విలువలు పరిరక్షణకై ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ,జనసేన పార్టీ కలిసి పనిచేస్తాయని, టీడీపీ అభ్యర్థి విత్ డ్రా చేసుకొని..జనసేన అభ్యర్థిని గెలిపించే దిశగా టీడీపీ,జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి నిర్ణయం చేశామన్నారు. ఇది ప్రాంతీయంగా టీడీపీ,జనసేన చేసుకొన్న ఒప్పందం మాత్రమే అన్నారు.
రాష్ట్ర పార్టీలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆచంట ఎంపీపీ ఎన్నికలో జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చింది. దీంతో మేం విజయం సాధించాం..అదే విధంగా జనసేన అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తే విజయం సాధిస్తామన్నారు. ప్రతి గ్రామంలోని టీడీపీ ,జనసేన కార్యకర్తలు నాయకులు కలసి పని చేసి ..జనసేన జడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు.