Jailer Song : తమన్నా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన జపాన్ అమ్మాయిలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. విడుదలై కొద్ది రోజులే అయిన కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.. ఈ సినిమా వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, జైలర్ కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టింది.. ఇప్పుడు సూపర్ స్టార్ కు జైలర్ అంత పెద్ద విజయం సాధించి పెట్టింది. నెల్సన్ గత చిత్రం బీస్ట్ దెబ్బ కొట్టడంతో ఈ మీద గట్టిగానే ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో రజినీకాంత్ నటన, ఆయన ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేసింది. జైలర్ విదులైన అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
మొదటి రోజే దాదాపు 90 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు 10 కోట్ల వరకు వసూల్ చేసింది.ప్రస్తుతం ఈ మూవీ 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక ఈ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రజినీకాంత్ కు జోడీగా నటించారు. అలాగే తమన్నా ఓ కీలక పాత్రలో మెరిసింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మహన్ లాల్ , టాలీవుడ్ నుంచి సునీల్ ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించారు…
Also Read
ఇకపోతే ఈ సినిమాలోని తమన్నా ‘నువ్ కావాలయ్యా’ అనే పాటలో స్టెప్పులేసింది. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పాట మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇదే వీడియో దర్శనమిస్తుంది. చాల మంది ఈ వీడియోకు రీల్స్ చేసి తమ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇద్దరు జపాన్ కు చెందిన యువతులు ఈ పాట హుక్ స్టెప్ ను వేసి అందరిని ఆకట్టుకున్నారు. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి..
There is no stopping the #Kaavaalaa fever! 💃💥 Vibes from #Tokyo #Japan 🏯🎌 Truly a pan-world hit 🌍❤️🔥#JailerFromAug10th #Jailer #Rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @tamannaahspeaks @shilparao11 @sunpictures pic.twitter.com/Lnzc2M1frk
— Ajas (@AjasOnline) July 26, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!