NTV Telugu Site icon

ఆ వైన్ ఫ్యాక్ట‌రీలో బ‌య‌ట‌ప‌డ్డ పురాత‌న ఉంగ‌రం… దానికోస‌మే ధ‌రించేవార‌ట‌…

ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన అతిపెద్ద వైన్ ఫ్యాక్ట‌రీ ఇటీవ‌లే ఇజ్రాయిల్‌లో బ‌య‌ట‌ప‌డింది. ఈ ఫ్యాక్ట‌రీలో అప్ప‌ట్లో పెద్ద ఎత్తున వైన్‌ను ఉత్ప‌త్తి చేసేవారని పురాత‌త్వ శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫ్యాక్ట‌రీ బ‌య‌ట‌ప‌డిని త‌రువాత దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల కోసం త‌వ్వ‌కాలు జ‌రుపుతుండ‌గా వారికి ఓ ఉంగ‌రం దొరికింది. బంగారంతో, ఊదారంగు రాయితో త‌యారు చేసిన ఆ ఉంగ‌రాన్ని హ్యాంగోవ‌ర్ ఉంగ‌రంగా పిలుస్తార‌ట‌. దీనిని ధ‌న‌వంతులు ధ‌రించేవారిని, ఈ ఉంగ‌రాన్ని ధ‌రించ‌డం వ‌ల‌న హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌తార‌నే న‌మ్మ‌కం ఉండేద‌ని, అంతేకాకుండా, అనేక ర‌కాల జ‌బ్బుల నుంచి కూడా బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని అప్ప‌టి ప్ర‌జ‌లు న‌మ్మేవారిన పురాత‌త్వ నిపుణులు చెబుతున్నారు. ఈ ఉంగ‌రం సుమారు 1400 ఏళ్ల క్రితం నాటిదని నిపుణులు చెబుతున్నారు.

Read: ఉరిశిక్ష నుంచి ఆ వ్య‌క్తిని కాపాడిన క‌రోనా…