Site icon NTV Telugu

Israel: ఇజ్రాయెల్‌ ప్రధాని సంచలన నిర్ణయం.. అల్‌ జజీరా ఛానెల్‌పై నిషేధం

Iska

Iska

హమాస్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసింది. తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్‌ నెటవర్క్‌ అల్‌ జజీరా ఛానెల్‌పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో అల్‌ జజీరా ఛానెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: PM Modi: మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం..

ఖతర్‌కు దేశానికి చెందిన న్యూస్‌ నెట్‌వర్క్‌ అల్‌ జజీరా ఛానెల్‌ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. హమాస్ మద్దతుగా.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉన్న అల్‌ జజీరా ఛానెల్‌ను ఇజ్రాయెల్‌లో మూసివేస్తున్నట్లు ప్రధాని బెంజమిన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: షారుఖ్ కంటే నాకే ఎక్కువిస్తానన్నారు.. పవన్ కామెంట్స్ వైరల్

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వారు ఎవరైనా ఇకపై ఇజ్రాయెల్‌లో ఉండలేరని.. అట్టివారి ఆస్తులు జప్తు చేయబడతాయని కమ్యూనికేషన్ల మంత్రి ష్లోమో కర్హి తెలిపారు. అల్ జజీరా హమాస్‌తో సన్నహిత సంబంధాన్ని కలిగి ఉందని తెలిపారు. పాలస్తీనా అనుకూల వైఖరిని అవలంభిస్తుందని ఇజ్రాయెల్ ఎప్పట్నుంచో ఆరోపిస్తోంది.. ఈ నేపథ్యంలో వేటు వేసింది. మా ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: Chandrababu: కిరణ్ కుమార్ రెడ్డి, జయచంద్రా రెడ్డిని గెలిపించండి

గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్‌ డిమాండ్‌ను ప్రధాని బెంజమిన్‌ తిరస్కరించారు. హమాస్‌ తమకు ఎప్పుడూ ప్రమాదకరమైనదేనని అన్నారు. ఇజ్రాయెల్‌ లొంగిపోదని.. గాజాలో హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు కొనసాగిస్తాని తేల్చిచెప్పారు. మరోవైపు.. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య శాంతి నెలకొల్పడం కోసం ఖతర్‌, ఈజిప్ట్‌, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా.. బెంజమిన్‌ ససేమిరా అంటున్నారు. ఇంకోవైపు అమెరికా యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల నిరసనలతో దద్దరిల్లుతోంది.

 

Exit mobile version