Site icon NTV Telugu

కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై దృష్టిపెట్టిన ఇజ్రాయెల్

కరోనా మహహ్మరి కొత్త రూపాంతరం చెందుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ కొత్త కొత్త వేరియంట్‌లతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇజ్రాయెల్‌ కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ కేసు నమోదైంది.

ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు విదేశీయులను దేశంలోకి రాకుండా, కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్‌ అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా విదేశాల నుంచి విమాన ప్రయాణాలను రద్దు ప్రకటించనుంది. పూర్తి క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆదివారం అర్ధరాత్రి నిషేధం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

Exit mobile version