ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ నుంచి అనేక కొత్త వేరియంట్లు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా ఫ్లోరోనా వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో తొలి ఫ్లోరోనా కేసు నమోదైంది.
Read Also: భర్త ఆ పని చేయలేదని అర్ధరాత్రి దారుణానికి ఒడిగట్టిన భార్య
ఫ్లోరోనా అంటే కోవిడ్-19 అని.. ఇది డబుల్ ఇన్ఫెక్షన్ వైరస్ అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇజ్రాయెల్‌లో తొలిసారి ఈ తరహా కేసు వెలుగుచూడటంతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లోరోనా వ్యాధి వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. మరోవైపు ఇజ్రాయెల్‌లో కరోనా వ్యాక్సిన్ నాలుగో డోసును ప్రజలకు అందించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. నాలుగు నెలల కిందటే ఇజ్రాయెల్‌లో కరోనా మూడో డోస్ వ్యాక్సిన్‌ను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.
