బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా అభ్యర్థిని కూడా ప్రకటించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరులో నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో మరోసారి సురేష్‌ను ఉప ఎన్నికల్లో అభ్యర్ధిగా బీజేపీ ఎంపికచేసింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్నికల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ కోసం జనసేన పార్టీ ప్రచారం చేసింది. కాని, అక్కడ ఆ పార్టీ ఓటమిపాలైంది. ఇప్పుడు జనసేన పోటీ చేయకూడదని అనుకున్నా, బీజేపీ పోటీకి దిగడంతో జనసేన ప్రచారం చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించింది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన కమలమ్మను ఎంపిక చేశారు. 2014 తరువాత కూడా కమలమ్మ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
Read: అదృష్టం అంటే వారిదే: పార్క్‌లో వాకింగ్ చేసేందుకు వెళ్లగా…