Site icon NTV Telugu

సరికొత్త ఆవిష్క‌ర‌ణ‌: ఈ స్కూట‌ర్‌ను మ‌డ‌త‌పెట్టి బ్యాగ్‌లో పెట్టుకోవ‌చ్చు…

స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌కు నిత్యం ముందుండే జ‌పాన్ ఇప్పుడు స‌రికొత్త స్కూట‌ర్ తో ముందుకు వ‌చ్చింది.  బుల్లి స్కూట‌ర్‌ను ఆవిష్క‌రించింది.  జ‌పాన్ కు చెందిన టొక్యో విశ్వవిద్యాల‌యం శాస్త్ర‌వేత్త‌లు ఇన్‌ప్లాట‌బుల్ స్కూట‌ర్‌ను ఆవిష్క‌రించారు.  ఈ ఇన్‌ఫ్లాట‌బుల్ ప్రోటోటైప్ స్కూట‌ర్ పోమోను రిలీజ్ చేశారు.  ఈ పోమోలో సాధార‌ణ బైకుల త‌యారీలో వినియోగంచే మెట‌ల్ కాకుడా థెర్మోప్లాస్టిక్ ర‌బ్బ‌ర్‌తో బైక్ బాడీని త‌ర‌యారు చేశారు.  దీంతో బైక్ బాడీ బ‌రువు త‌గ్గిపోతుంది.  అంతేకాకుండా మ‌డ‌త‌పెట్టేందుకు వీలుగా కూడా ఉంటుంది.  గాలిమిష‌న్‌తో గాలికొడితే రెండు నిమిషాల్లో బైక్ బాడీలోకి గాలి వెళ్లి బాడీ రెడీ అవుతుంది.  ఈ బైక్‌లో నాలుగు వీల్స్ ఉంటాయి.  

Read: ఆ రెండు దేశాల‌ను అధిక‌మించ‌డానికి భార‌త్‌కు రెండేళ్లు చాలు…

అంటేకాదు, ఇందులో మోటార్ క‌మ్ బ్యాట‌రీ ఉంటుంది.  ఈ బైక్ కు సంబంధించిన కంట్రోల్స్ అన్ని కూడా బైక్ హ్యాండిల్ వ‌ద్ద ఉంటాయి.  అంతేకాదు, అవ‌స‌రాల‌కు అనుగుణంగా బైక్‌ను విభిన్న‌మైన డిజైన్ల‌లో త‌యారు చేసుకోవ‌చ్చు.  5.5 కేజీల బరువుండే ఈ బైక్‌ను మ‌డ‌త‌పెట్టి బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకోవ‌చ్చు.  ఈ పోమో బైక్ బ్యాట‌రీని ఒక‌సారి చార్జ్ చేస్తే గంట‌కు 15 కిమీ వేగంతో 90 నిమిషాల‌పాటు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.  గ‌రిష్టంగా 20 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.  చిన్న‌చిన్న అవ‌స‌రాల కోసం ఈ పోమో బైక్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని టొక్యో శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  

Exit mobile version