బిజీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఉన్నారు.. దీంట్లో ముందు వరుసలో ఉంటారు.. ఆనంద్ మహేంద్ర.. ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విషయాలపై స్పందిస్తుంటారు.. ఇక, అప్పుడప్పుడు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా సందర్భాన్ని బట్టి తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. తాజాగా రతన్ టాటాను ఓ ఫొటో ఆకట్టుకుంది.. పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే టాటా.. ఆ ఫొటోలోని సన్నివేశాన్ని చూసి స్పందించకుండా ఉండలేకపోయారు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ ఫొటోను షేర్ చేస్తూ.. అభినందనలు తెలియజేశారు.
వర్షాకాలంలో తగు జాగ్రత్తలతో బయటకు వెళ్తుంటాం.. కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు.. సడన్‌గా వర్షంలో చిక్కుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి.. వర్షానికి చిక్కినా.. మనుషులు అయితే.. ఎలాగో అలా ఇంటికి చేరుకుని సేద తీరుతారు.. ఇక, పెంపుడు జంతులకు తగు రక్షణ కల్పిస్తాడు దాని యజమానికి కానీ, రోడ్డుపై ఉండే చాలా జంతులు ఎక్కడికో పరగులు పెట్టాల్సిన పరిస్థితి.. వర్షం వచ్చినా.. చలి పెట్టిన.. ఎండ కొట్టినా.. ఎక్కడో ఓ దగ్గర రోడ్లపై ఉండాల్సిందే.. ఇక, జంతులను ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు.. రోడ్డుపై ఏదైనా కనబడితో.. వాటికి తిండి పెట్టేవారు కూడా ఉన్నారు. మరోవైపు తమ పెంపుడు జంతువులు తప్పిపోతే అల్లాడిపోయేవారు ఉన్నారు. పీఎస్‌లకు వెళ్లిన ఫిర్యాదులు చేసేవారు.. ఏకంగా ప్రకటనలు ఇచ్చేవారిని కూడా చూశాం.. బిజినెస్ టైకూన్ రతన్ టాటాకు కూడా జంతువులు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర చాలా పెట్స్ ఉంటాయని చెబుతుంటారు.. అయితే.. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫోటో రతన్ టాటాను కదిలిచింది.. ముంబైలోని తాజ్ హోటల్‌లో పనిచేసే ఓ ఉద్యోగి.. వర్షానికి తడుస్తున్న ఓ వీధికుక్కకు తడవకుండా గొడుగు పట్టుకుని నిలిచున్నాడు.. ఆ ఫోటోను చూసి రతన్ టాటా షేర్ చేసి కామెంట్ పెట్టకుండా ఉండలేకపోయారు.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆ ఫొటోను షేర్ చేసిన టాటా.. ఇది చాలా బెస్ట్ మూమెంట్. వీధికుక్కలకు తోచినంత సాయం చేయడం అనేది గొప్ప విషయం.. తాజ్ ఉద్యోగి చేసిన పనిని నేను అభినందిస్తున్నా.. అంటూ కామెంట్ పెట్టారు. దీంతో.. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా నుంచి మీడియాకు కూడా ఎక్కేసింది.. ఇక, చాలా మంది రతన్ టాటా స్పందనపై అభినందనలు కురిపిస్తున్నారు.
Garmin Instinct Rugged GPS dardarkom – Lakeside Blue: Amazon.co.uk
