Site icon NTV Telugu

పారాలింపిక్స్ 2020 : భారత్ కు మరో సిల్వర్

Yogesh Kathuniya

Yogesh Kathuniya

పారాలింపిక్స్ 2020 లో తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల డిస్క్ త్రో లో రజత పతకం సాధించాడు భారత అథ్లెట్ యోగేష్. 44.38 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి ఈ సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు యోగేష్. అయితే మొదటి స్థానంలో బ్రెజిల్ కు చెందిన అథ్లెట్ 45.59 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి స్వర్ణం సాధించాడు. ఇక భారత్ కు ఇప్పటికే ఒక్క గోల్డ్, రెండు సిల్వర్, ఒక్క బ్రౌన్జ్ వచ్చాయి. దాంతో యోగేష్ పతకం ఇది భారత్ ఖాతాలో మూడో రజతం కాగా మొత్తంగా 5వ పతకం. అయితే రజతం సాధించిన యోగేష్ కు భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version