NTV Telugu Site icon

లద్దాఖ్‌లో ఆర్మీచేతికి సరికొత్త‌ ఆయుధం…

గ‌త కొంత‌కాలంగా ల‌ద్దాఖ్ స‌రిహ‌ద్దుల్లో ఇండియా-చైనా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.  ఈ నెప‌థ్యంలో ఇండియా తూర్పు ల‌ద్దాఖ్ లో అధునాతమైన ఆయుధాల‌ను మోహ‌రిస్తూ వ‌స్తోంది.  ఇందులో భాగంగా ఇప్పుడు ఇండియ‌న్ ఆర్మీ చేతికి ఓ అధునాత‌న‌మైన ఆయుధం ల‌భించింది. ఫార్వార్డ్ ఏరియాల్లో తొలిసారిగా కే9  వ‌జ్ర అనే శ‌త‌ఘ్న‌ల‌ను మోహ‌రించారు.  ఈ కే 9 వ‌జ్ర శ‌త‌ఘ్న‌లు 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న శ‌తృ స్థావ‌రాల‌ను ద్వంసం చేయ‌గ‌ల శ‌క్తిని క‌లిగి ఉంటాయి.  ఈ శ‌త‌ఘ్న‌లు అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ ఇవి ప‌నిచేస్తాయ‌ని అధికారులు చెబుతున్నారు.  వీటిని 2018లో సైన్యంలో ప్ర‌వేశ‌పెట్టారు.  మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా వీటిని గుజ‌రాత్‌లోని ఎల్ అండ్ టీ త‌యారు చేస్తున్న‌ది.  ఈ శ‌త‌ఘ్న‌లు 47 కేజీల బాంబుల‌ను పేల్చే సామ‌ర్థ్యం క‌లిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.  

Read: రేవంత్ ఇంటివ‌ద్ధ భారీగా పోలీసుల మోహ‌రింపు… ఇదే కార‌ణం…