NTV Telugu Site icon

India Vs Australia ODI: విశాఖలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్.. ఫ్యాన్స్ ఎదురుచూపు

Ind Vs Aus

Ind Vs Aus

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19న విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ జరగబోతుంది. ఇది డే అండ్ నైట్ మ్యాచ్. ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. విశాఖలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించారు. ఈ మ్యాచ్ కోసం విశాఖవాసులు ఎదురు చూస్తున్నారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే ఈ నెల 17న జరగనుంది. రెండో వన్డే 19న విశాఖపట్నంలో జరుగుతుంది. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతుది.

Also Read:New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
వన్డే సిరీస్‌కు పూర్తి స్థాయి జట్టునే ఎంపిక చేసినప్పటకీ.. నిలకడగా రాణిస్తున్న పలువురు యువక్రికెటర్లు కూడా చోటు దక్కించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్‌శర్మ అందుబాటులో ఉండడం లేదు. దీంతో హార్థిక్ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా సారథి ప్యాట్‌ కమిన్స్‌.. తల్లి మరణం నేపథ్యంలో ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టీవ్‌ స్మిత్‌ పగ్గాలు చేపట్టనున్నాడు.

Also Read:MLC Elections : ఏపీ ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌

విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ జరిగింది. చాలా కాలం తర్వాత ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండడంతో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉన్నారు. విశాఖ స్టేడియం టీమిండియాకు బాగా కలిసొచ్చింది. గత రికార్డుల్లో ఇక్కడ భారత్‌దే పైచేయిగా ఉంది. 10 వన్డేల్లో కేవలం ఒకసారి మాత్రమే టీమిండియా పరాజయం పాలవగా.. 7 మ్యాచ్‌లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిస్తే.. మరొకటి వర్షంతో రద్దయింది.

కాగా, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన రోహిత్‌ సేన.. కంగారూలతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.

Show comments