కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఇటు కరోనాతో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. ఇక ఈ కరోనా మహమ్మారి భారత క్రికెటర్ల ఇళ్ళల్లోనూ విషాదం నింపుతోంది. ఇప్పటికే టీం ఇండియా మాజీ క్రికెటర్ పియూష్ చావ్లా, ఆర్పీ సింగ్ ల తండ్రులు కరోనాతో మృతి చెందగా.. తాజాగా టీం ఇండియా మహిళా క్రికెటర్ ప్రియా పునియా తల్లి కరోనా సోకి మృతి చెందింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియా పునియా పేర్కొంది. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ప్రియా పునియా ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లే తన మార్గదర్శి అని, జీవితంలో కొన్ని నిజాలను అంగీకరించక తప్పదని పేర్కొంది ప్రియా పునియా. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ.. చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపింది.
టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట విషాదం..!
