Site icon NTV Telugu

ఇండియాలో కొత్తగా 6990 కరోనా కేసులు.. మరణాలు 190 నమోదు

మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 6,990 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 1,00,543 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 190 మంది మృతి చెందారు.

ఇక గడిచిన 24 గంటల్లో 10,116 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,68,980 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంట‌ల్లో 78,80, 545 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,23,25, 02,767 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.

Exit mobile version