రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ హారీష్ అనే యువకుడికి 11 ఏళ్ల క్రితం పాక్ కు చెందిన ఉస్రా ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాజస్థాన్‌లోని ఓ పెద్ద కంపెనీలో హారిష్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. దేశాలు వేరు కావడంతో ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఒకసారి పాక్ వెళ్లి ఉస్రా తల్లిదండ్రులను కలిసి ఒప్పించాడు. వివాహానికి వారి బంధువులు కూడా ఒప్పుకున్నారు. ఇక పెళ్లి బాజాలు మోగుతాయి అనుకున్న సమయంలో కాశ్మీర్ సమస్య వచ్చింది. దీంతో వీసాలు ఆగిపోయాయి.
Read: దివాళీ ఆఫర్: ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్‌కి స్వీట్ ప్యాకెట్ ఫ్రీ…
కాశ్మీర్ సమస్య నుంచి బయటపడేలోగా కరోనా మహమ్మారి వచ్చింది. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించినప్పటికీ, ఇండియా పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇండియా పాక్ వెళ్లేందుకు వీసాలు ఇవ్వడంలేదు. రెండు దేశాల మధ్య ఎప్పటికి మామూలు పరిస్థితులు నెలకొంటాయో తెలియడంలేదు. దీంతో హారిష్, ఉస్రాలు ఆన్‌లైన్ ద్వారా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని నిఖా కానిచ్చేశారు. తమ వివాహానికి చట్టబద్దత ఉంటుందని, తప్పనిసరిగా వీసాకు అనుమతులు వస్తాయని, 600 కిలోమీటర్ల ఆవల ఉన్న తన భార్యను త్వరలోనే కలుసుకుంటానని అంటున్నాడు హారిష్.