ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇండియా అలర్ట్ అయింది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ను వేగం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు సగటున 50 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రయ మందకోడిగా సాగింది. ఎప్పుడైతే ఒమిక్రాన్ వేరియంట్‌ను వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిందో అప్పటి నుంచి వ్యాక్సినేషన్‌ను మరింత వేగంవంతం చేశారు.
Read: అమెరికా చైనా ఆధిపత్యపోరు…బలికానున్న 200 కంపెనీలు…!!
శనివారం రోజున ఇండియాలో కోటికి మిందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 127 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించారు. ఇండియాలో ఇప్పటి వరకు నాలుగు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లో 30కి పైగా మ్యూటేషన్లు ఉండటంతో ప్రపంచం అప్రమత్తం అయింది.
