జాతి చరిత్రలో పంద్రాగస్టు వేడుకలు ఒక విశిష్ట ఘట్టం : సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని… జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని వివరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని తెలిపారు. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Also : న్యూ లుక్ లో పవర్ స్టార్… పిక్ వైరల్
Also Read
- Modi-Marco Rubio: సేవా తీర్థ్‌లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ శిల్పం తొలగింపు
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
ఈ సందర్భంగా 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ ప్రస్థానం లోని వెలుగు నీడల్నిమనందరం వివేచించుకోవాలని… మనం సాధించింది ఏమిటి ? ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేసుకోవాలని తెలిపారు. ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంతమేరకు పురోగతిని సాధించిందని… అదేసమయంలో నేటికీ చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి” అని మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటనూ ఇప్పటికీ మనం అన్వయించుకో వలసిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ వివరించారు. మరింత నిబద్ధత, నిజాయితీ. సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారతప్రజలు పునరంకితం కావాలని కోరుకుంటున్నానన్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్‌లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!