Lifestyle : పెళ్లి తర్వాత మగవారు ఇలా చేస్తే అస్సలు గొడవలు రావు..స్వర్గాన్ని చూస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ జీవితంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది..నూరేళ్ల జీవితం.. పెళ్లి తర్వాత మనం చనిపోయేవరకు మనతో తోడుగా ఉండే ఆత్మీయ బంధం..అయితే ఈ మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటంలేదు.. ఇద్దరు సమాన స్థాయిలో ఉండటంతో గొడవలు రావడంతో విడిపోతున్నారు..అలా విడిపోకుండా ఉండాలంటే మగవాళ్ళు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.. అప్పుడే గొడవలు రాకుండా ఉంటాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
*. మ్యారేజ్ రిలేషన్ హ్యాపీగా ఉండాలంటే తనని సంతోషంగా ఉండేలా చూసుకోండి. మీకు వీలైనంతగా వారిని నవ్వించే ప్రయత్నం చేయండి.రిలేషన్‌లో ఉన్నప్పుడు వారి హ్యాపీనెస్ కూడా ముఖ్యం. తను ఏం కావాలనుకుంటుంది.. ఏం చేస్తే హ్యాపీగా ఉంటుందో తెలుసుకుని అలా చెయ్యడం వల్ల గొడవలు రావు..బంధం మరింత బలపడుతుంది..
Also Read
*. పెళ్ళైన కొత్తలో మగవాళ్ళు భార్యకు అడగకుండానే అన్నీ కొనిస్తారు.. వరుసగా సర్ ప్రైజ్ లు ఇస్తారు.. ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోతారు..కానీ, అలా చేయొద్దు. ఎన్ని సంవత్సరాలైన తమ పార్టనర్‌ని అట్రాక్ట్ చేయడం, ఆనందపెట్టడం ముఖ్యం. కాబట్టి, ఏవైనా స్పెషల్ డేస్, అలాంటి సందర్భాల్లో కచ్చితంగా చిన్నవైనా ఇచ్చి వారిని సంతోష పెట్టండి..
*. డబ్బు పొదుపు చేయడం ముఖ్యమే. కానీ, భార్య విషయంలో అది వద్దండోయ్. ఇలాంటప్పుడు మీరు కొన్నింటిని డబ్బుతో కొనలేరు. నచ్చినవి కొనిచ్చి తన కళ్ళలో ఆనందాన్ని చూస్తే దాన్ని మీరు ఎంత డబ్బు పెట్టినా ఆ సంతోషం మీకు దొరకదు..తను సంతోషంగా ఉండటమే కాదు.. మిమ్మల్ని సంతోష పెడుతుంది..
*. ఏదైనా సందర్భంలో భార్యలు బాధపడుతుంటే అలాంటప్పుడు భర్తలు కచ్చితంగా తమ వెన్నంటే ఉండాలి. ఎలాంటి సందర్బంలోనూ తన చేయిని వదలొద్దు. వారు ఏం చెబుతున్నారో వినండి. వారికి ఏం కావాలో చేయండి.కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు కాదు మీరు ఇవ్వాల్సింది.. సాయంగా ఉండండి. తను కలత చెందితే కంటికి రెప్పలా చూడండి. ఇది ఎలా ఉండాలంటే మీ ఓదార్పుతో తను ఆ బాధనే పూర్తిగా మర్చిపోయి మీ కౌగిలిలో కరిగిపోయేలా ఉండాలి..
*. చాలా మంది మగవారు తమ భార్యలు తమకి నచ్చినట్లుగానే ఉండేలా మార్చాలని చూస్తుంటారు. అది సరికాదు.మీరు మీ పార్టనర్‌ని మార్చాలని ప్రయత్నాలు చేస్తే అది కొన్ని రోజుల తర్వాత వారిని ఇబ్బందికి గురి చేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. కాబట్టి, వారిని అలానే ఉండనివ్వండి. అలానే ఇష్టపడండి. తను మీకు ఎలా ఉంటే ఇష్టమని తెలిస్తే తనే అలా మారుతుంది.. ఏదైనా ప్రేమగా మార్చుకోవాలి.. ఇలా చేస్తే భార్యలు మీకు స్వర్గాన్ని చూపిస్తారు.. అందరిని వదులుకొని మీరే ప్రాణంగా బ్రతుకుతున్నారు.. ప్రేమించండి డ్యూడ్.. వాళ్ళే మీకోసం ప్రాణాలు ఇస్తారు..
తాజావార్తలు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?