NTV Telugu Site icon

ఇంట్లోనే సొంతంగా కరోనా టెస్టులు… !!

టెస్ట్… ట్రేస్… ట్రీట్ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఈ మూడు విధానాలను పాటిస్తున్నారు.  అయితే, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించడం వలన చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్య కొంతమేర తక్కువగా ఉంటోంది.  అంతేకాదు, చాలా ప్రాంతాల్లో కరోనా టెస్టులు ఎలా చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  కాగా, ఇప్పుడు ఇండియాలో సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్టులు చేసుకోవడానికి వీలు ఉండేవిధంగా ఓ కిట్ ను రూపొందించారు.  ఈ కిట్ కు ఐసిఎంఆర్ ఆమోదం తెలిపింది.  కోవిసెల్ఫ్ టిఎం కోవిడ్ 19 ఓటీసి యాంటిజెన్ ఎల్ ఎఫ్ అనే కరోనా కిట్ ను పూణే కు చెందిన మైల్యాబ్స్ డిస్కవరీ సోలుషన్స్ అనే సంస్థ తయారు చేసింది.  
ఈ టెస్ట్ కిట్ కోసం ఓ మొబైల్ యాప్ ను రూపొందించారు.  ఈ యాప్ సహాయంతో టెస్ట్ కిట్ తో పరీక్షలు చేసుకోవచ్చు.  టెస్ట్ కిట్ లో ఉన్న వస్తువులతో టెస్ట్ చేసుకోవాలి.  టెస్టు లను ఫోటో తీసి యాప్ లో నమోదు చేయాలి. టెస్ట్ లను పరిశీలించిన తర్వాత యాప్ కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా నెగిటివ్ వచ్చిందా అన్నది తెలియజేస్తుంది.