ఐస్‌క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే. ఇష్టంగా తీసుకుంటుంటారు. ఎన్నో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉండేందుకు రకరకాల ఫ్లేవర్లను తయారు చేస్తుంటాయి. అన్ని కంపెనీలలోకి బెన్ అండ్ జెర్రీ కంపెనీ వేరుగా ఉంటుంది. యూఎస్‌లోని వెర్మెంట్‌లో వాటర్‌బర్నీ అనే గ్రామంలో 1978లో బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీమ్ పార్లర్‌ను స్థాపించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను తయారు చేసేవారు. వినియోగదారులకు నచ్చని ఐస్‌క్రీమ్‌లకు వాటి ఫ్లేవర్ల రూపంలోనే పార్లర్‌సమీపంలో సమాధి చేసేవారు. సమాధిపై ఆ ఐస్‌క్రీమ్‌ను ఎప్పుడు తయారు చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నది. ఎలాంటి రుచి ఉన్నది అనే విషయాలను సమాధి శిలాఫకలంపై ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో అక్కడ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లకు సమాధులు ఏర్పాటు చేశారు. గతంలో బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీమ్‌ల కోసం ఇతర ప్రాంతాల నుంచి, నగరాల నుంచి అక్కడివచ్చేవారట. ఇప్పుడు యూఎస్‌లోని అన్ని నగరాల్లో ఈ కంపెనీ ఐస్‌క్రీమ్‌లు దొరుకుతున్నాయని యాజమాన్యం చెబుతున్నది.
Read: నాలుగు రోజులుగా పోలీస్ స్టేషన్లోనే కోడి పుంజులు… ఎందుకంటే…