NTV Telugu Site icon

నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టం : సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేడు ఆయన సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే ఆయనను గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరేగింపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల అభినందన సభలో మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోను.. నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.


చిన్నతనంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 1967లోనే రాజకీయంగా చైతన్యమైన గ్రామం మాది. అప్పట్లోనే మా గ్రామంలో 3 పార్టీల నేతలు ఉండేవారు. వివిధ పార్టీలు ఉన్నా ఏ గొడవలు అప్పట్లో ఉండేవి కావు. అప్పట్లో ఎన్నికల్లోనే విబేధాలు ఆ తర్వాత కలిసి ఉండేవారంటూ ఆయన పేర్కొన్నారు.