ఇప్పటి వరకు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. బైక్ నడిపే వారితో పాటుగా వెనక కూర్చున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు నిఘాను పెంచి హెల్మెట్ ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, నగరంలో చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించకుండా వాహానలు నడుపుతున్నారు. దీనిపై పోలీసులు దృష్టిసారించారు. హెల్మెట్‌తో పాటుగా మాస్క్ ధరించకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. హెల్మెట్ తో పాటుగా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మాస్క్ ధరించని వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Read: 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు… భారత్‌కు డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు