NTV Telugu Site icon

షాకింగ్ స‌ర్వే: ప్రేమ వివాహాల‌కు హైద‌రాబాదీలు ఓకే…

ప్రేమ‌లు వ‌ర‌కు ఓకే అదే ప్రేమ పెళ్లి వ‌ర‌కు వ‌చ్చే స‌రికి అనేక అడ్డంకులు ఎదురౌతుంటాయి. ప్రేమ పెళ్లిళ్ల త‌రువాత ఎన్ని క‌ష్టాలు ఎదుర‌వుతాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట్లో త‌ల్లిదండ్రుల మ‌ద్ద‌తు ఉంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న‌వారి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, ప్రేమ పెళ్లిళ్ల‌కు ఎంత మంది పేరెంట్స్ అనుకూలంగా ఉన్నారు అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు ట్రూలీమ్యాడ్లీ అనే డేటింగ్ యాప్ స‌ర్వేను నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో హైద‌రాబాద్ త‌ల్లులు త‌మ పిల్ల‌ల ప్రేమ వివాహాల‌కు అనుకూలంగా ఉన్న‌ట్టు తేలింది. 84శాతం మంది హైద‌రాబాద్ త‌ల్లులు త‌మ పిల్ల‌ల ప్రేమ వివాహాల‌కు అనుకూలంగా ఉన్నారు. దేశం మొత్తంమీద చూసుకుంటే 50శాతం మంది తల్లులు త‌మ పిల్ల‌ల ప్రేమ వివాహాల‌కు అనుకూలంగా ఉన్నారు. ఉత్త‌రాదితో పొలిస్తే ద‌క్షిణాదినే ఈ విష‌యంలో ముందు ఉన్న‌ట్టుగా స‌ర్వేలో తేలింది.

Read: అదే జ‌రిగితే మ‌ళ్లీ క‌రోనా విజృంభించ‌వ‌చ్చు…