హైదరాబాద్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక బయటకు వచ్చి ఎక్కడికైనా పోదామానుకుంటే వర్షాలకు బండి మీద పోలేకున్నారు.. ఇక క్యాబ్ ను బుక్ చేసుకొని వెల్దామంటే టమోటా ధరల కన్నా ఎక్కువ ధరలతో షాక్ ఇస్తున్నారు.. కొద్ది దూరంకు కూడా వేలు వసూల్ చేస్తూ జనాలను హడాలెత్తిస్తున్నారు.. చిన్నపాటి వర్షానికి భాగ్యనగరం లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక ట్రాఫిక్ సంగతి సరేసరి. భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికుల అవస్థలు చెప్పనలవి కాదు.
ఇక ఇలాంటి పరిస్థితుల్లో క్యాబ్‌లను ఆశ్రయిస్తే ఇక వాటి ధరలు చూసి జనం షాకవుతున్నారు. సాధారణ రోజుల్లో ఉండే క్యాబ్ ధరలతో పోలిస్తే వాటికి రెండింతలు, మూడింతలు ధరలు వసూలు చేస్తున్నారు.. సాధారణంగా బేగం పేట్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లాలంటే మామూలు రోజుల్లో రూ.700 నుంచి రూ.800 ఉంటుంది. ఈ వర్షాల కారణంగా దానికి డబుల్ రేట్లు పలుకుతున్నాయి. పోనీ ధర తగ్గించమని బేరాలు ఆడితే క్యాబ్ డ్రైవర్లు రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో క్యాబ్‌ల లో వెళ్లాలంటే సామాన్యుడికి అందని ధరలతో జనాలకు గుండె పోటు తెప్పిస్తున్నాయి..
తాజాగా సోషల్ మీడియా యూజర్ తాను క్యాబ్ ధరతో ఎదుర్కొన్న పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.. తనతో పాటు పలువురు ఈ విషయం పై తన అనుభవాల ను నెట్టింట పంచుకున్నారు.. తెలంగాణ వ్యాప్తంగా ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.. అదే విధంగా వర్షాలు వీడకుండా కురుస్తుండటం తో విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించారు.. మరో వైపు కూరగాయల ధరలు కూడా రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ప్రజలకు ఇప్పుడు వర్షాలు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది..
