NTV Telugu Site icon

Hyderabad :వర్షంలో బండి ఆగిందా? ఈ నెంబర్ కు కాల్ చెయ్యండి..!

Hderabad

Hderabad

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనాలు బయట కాలు పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారు.. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి..లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.. రోడ్లు నదులుగా మారాయి.. ఎటు చూసిన నీళ్లు కనిపిస్తున్నాయి.. ఎక్కడ ఏది ఉందో తెలియక వాహన దారులు ఇక్కట్లు పడుతున్నారు.. ఇక బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు వాహనాలపై బయటికి అత్యవసర పని మీద వెళ్లిన జనాలు, ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే మార్గమధ్యలో వర్షానికి ఇరుక్కుపోయిన వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు కీలక సమాచారం ఇచ్చారు..

హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయిస్తే, ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.. ఎక్కడ బండి ఆగిన వెంటనే ఈ 83339 93360 నెంబర్‌కు వాట్సప్ కాల్ చేస్తే సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తారు. ఇది సైబరాబాద్ కమిషనరేట్ పరిధి వరకు మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు..

అంతేకాదు పలు ప్రాంతాల టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా పోలీసులు తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఇక ఈ రెండు రోజుల్లో కురిసే అత్యంత భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముంది. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులతో పాటు పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.. ప్రజలు అధికారులకు సహకరించాలని, మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు..