హైదరాబాద్: స్వర్గీయ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం దాసరి కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభు రూ.2.11 కోట్లు తీసుకున్నారని… ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో వాళ్లు జాప్యం చేస్తుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు అనే బాధితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ పై బుధవారం విచారించిన సిటీ సివిల్ కోర్టు…ఆర్డర్ 34, రూల్స్ అండ్ SOFCPC.RW.SEC 151 CPC కింద దాసరి ప్రభు, దాసరి అరుణ్‌లకు నోటీసులు ఇచ్చింది. వారు తీసుకున్న డబ్బులను సోమశేఖర్‌రావుకు తిరిగి చెల్లించడానికి నవంబర్ 15 వరకు కోర్టు గడువు విధించింది. కాగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని అడిగినందుకు తనను చంపుతామని దాసరి కుమారులు బెదిరిస్తున్నారని గతంలోనే పిటిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Read Also: టపాసులు కాలుస్తున్నారా? అయితే పిల్లల చేత ఇలా చేయనివ్వద్దు