Site icon NTV Telugu

ఈటలకు షాక్ : మంత్రి హరీష్ రావుతో హుజూరాబాద్ నేతల భేటీ

సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని..క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధుల స్పష్టం చేశారు. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో కమలాపూర్ మండల నాయకుల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే పనిచేస్తామని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు విస్పష్టంగా ప్రకటించారు. కమలాపూర్ మండలంలోని టీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని వారు తెలిపారు. ఈ విషయంలో ఇతర ఎలాంటి ఆలోచనలకు తావు లేదని, తామంతా టీఆర్ఎస్.తోనే ఉన్నామని వారు స్పష్టంచేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగడానికి, నియోజకవర్గ ప్రజలకు మేలు జరగడానికి టీఆర్ఎస్ జెండా నీడలోనే సాధ్యమని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం ( 2001 ఏప్రిల్ 27 ) నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తాము కేసీఆర్ నాయకత్వంలోనే ఎప్పటికీ కొనసాగుతామని తెలిపారు.

Exit mobile version