NTV Telugu Site icon

అక్క‌డ వందేళ్లు బ‌త‌క‌డం వెరీ కామ‌న్‌… ఇదే కార‌ణం…

ఒక‌ప్పుడు వందేళ్లు బ‌త‌క‌డం చాలా ఈజీ.  కానీ ఈ ఆధునిక కాలుష్య‌పూరిత‌మైన కాలంలో 60 ఏళ్లు బ‌త‌క‌డమే క‌ష్టంగా మారింది.  ఇలాంటి స‌మ‌యంలో వందేళ్లు బ‌త‌క‌డం అంటే మామూలు విష‌యం కాదు.  అయితే, ఆ గ్రామ‌లోని ప్ర‌జ‌లు మాత్రం ఈజీగా వందేళ్లు బ‌తికేస్తార‌ట‌.  వందేళ్ల పుట్టిన‌రోజు వేడుక‌లు ఆ గ్రామంలో ష‌రా మాములే.  ఆ గ్రామంపేరు డెట్లింగ్‌.  ఇది యూకేలో ఉన్న‌ది.  ఈ గ్రామంలోని ప్ర‌జ‌లు అత్య‌ధిక ఏళ్లు బ‌త‌క‌డానికి కార‌ణం లేక‌పోలేదు.  

Read: పిల్ల‌ల‌కు కోవిడ్ టీకా… కోటి టీకాల‌కు కేంద్రం ఆర్డ‌ర్‌…

గ్రామంలో పూర్తిగా మ‌ద్య‌, ధూమ‌పానాన్ని నిలిపివేశారు.  ఈ నియ‌మాన్ని చిన్నారుల నుంచి ప్ర‌తి ఒక్క‌రూ పాటిస్తారు.  ఆరోగ్యం విష‌యంలో చాలా శ్ర‌ద్ద‌తీకుంటారు.  800 మంది జ‌నాభా క‌లిగిన ఈ రాష్ట్రంలో చాలా మంది ప్ర‌తిరోజూ జిమ్, యోగా వంటిని చేస్తుంటారు.  ఇక 800 మంది జ‌నాభా క‌లిగిన ఈ చిన్న గ్రామంలో 8 మంది వైద్యులు ఉన్నారు అంటే వారికి ఆరోగ్యం ప‌ట్ల ఎంత‌టి గుర్తింపు ఉన్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.