NTV Telugu Site icon

శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌: అలా చేయ‌కుంటే… మ‌నుషులు న‌ర‌మాంస‌భ‌క్షుల‌వుతారు…!!

భూమిపై మ‌నుషుల మ‌నుగ‌డ ఎంత‌కాలం పాటు ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.  ప్ర‌స్తుత ప‌రిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి.  భూకంపాలు, ప్ర‌కృతి విప‌త్తులు, మ‌హ‌మ్మారులు, గ్లోబ‌ల్ వార్మింగ్ ఇలా అన్ని మూకుమ్మ‌డిగా దాడులు చేస్తున్నాయి.  మూకుమ్మ‌డి దాడుల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గ‌త ద‌శాబ్ద‌కాలంగా ప్ర‌పంచంలో స‌గ‌టు ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి.  దృవ‌ప్రాంతాల్లోని మంచు క‌రిగిపోతున్న‌ది.  అనేక దేశాలు ఆదిప‌త్యం కోసం యుద్ధాలు చేసుకునే ప‌రిస్థితులు రాబోతున్నాయి.  ప్ర‌తీ దేశం భ‌యాన‌క‌మైన ఆయుధాల‌ను సొంతం చేసుకుంది.  ప‌దుల సంఖ్య‌లో అణ్వాయుధాలు క‌లిగిన దేశాలు ఉన్నాయి.  ఏ చిన్న తేడా వ‌చ్చినా భూగోళం మొత్తం మంటల్లో క‌లిసిపోతుంది.  ఇది ఎప్పుడైనా జ‌ర‌గ‌వ‌చ్చు.  

Read: హైదరాబాదీలకు కొత్త టెన్షన్‌.. ట్రావెల్‌ హిస్టరీ లేకున్నా ముగ్గురికి ఒమిక్రాన్..

అందుకే ముందుచూపుతో శాస్త్ర‌వేత్త‌లు భూమికి ప్ర‌త్యామ్నాయంగా మ‌నిషి ఆవాసయోగ్య‌మైన ప్ర‌దేశం కోసం అన్వేషిస్తున్నాడు.  విశ్వంలో టెలిస్కోపుల‌తో అలాంటి గ్ర‌హాల‌కోసం అన్వేషిస్తున్నారు.  చంద్రుడు, మార్స్‌పై రాబోయే ప‌దేళ్ల కాలంలో ఆవాసం ఏర్పాటు చేసుకోవాల‌ని చూస్తున్నాడు.  రాకెట్ యుగంలో ఇది సాధ్యం కావొచ్చు.  అయితే, అలా వెళ్లిన మ‌నిషికి ఆహారం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది.  ఎంత‌కాల‌మని భూమినుంచి తీసుకెళ్లిన ఆహారాన్ని వినియోగించుకుంటారు అన్న‌ది శాస్త్ర‌వేత్త‌ల ముందున్న ప్ర‌శ్న‌.  ఆహారం ల‌భించ‌క‌పోతే ఆక‌లి తీర్చుకోవ‌డానికి అవ‌స‌ర‌మైతే ఒక‌రినొక‌రు చంపుకొని తినేందుకు కూడా వెన‌కాడ‌బోర‌న్న‌ది వాస్త‌వం.  ఇలాంటి ప‌రిస్థితులు భూమిమీద‌నే ఎన్నో జ‌రిగాయి.  అలాంటిది వేరే గ్ర‌హం మీద ఎందుకు జ‌ర‌గ‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌నిషికోసం ఆవాసం ఏర్పాటు చేసేకంటే ముందు ఆయా గ్ర‌హాల‌పై కావాల్సిన ఆహార‌ప‌దార్థాల‌ను ఎలా పండించ‌గ‌లుగుతారో దానిపై ప్ర‌యోగాలు చేపట్టాల‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఆహార‌ప‌దార్థాల‌ను పండించ‌గ‌లిగితే త‌ప్ప‌కుండా మ‌నిషి ఆవాసానికి ఆ గ్ర‌హాలు అనువుగా మార‌తాయిన శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.