కరోనా కాలంలో శరీరంపైనా, ఆరోగ్యంపైనా శ్రద్ధ కొంత మేర పెరిగింది. పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలు అలవాటు పడుతున్నారు. శరీరం కరోనా లాంటి వైరస్‌లను తట్టుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే మూడు విషయాలను తప్పనిసరిగా ఫాలో కావాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. నిత్యం కుర్చీలకు అతుక్కుపోయోవారి కంటే వ్యాయామం, ఏరోబిక్స్ చేసేవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అదే విధంగా ఫ్యాట్ పుడ్ కంటే ఫైబర్, న్యూట్రీషన్ పుడ్ ను తీసుకోవడం ఉత్తమం. క్రమం తప్పకుండా నీరు తీసుకొవాలి. పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. అదే విధంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. మానసికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రోగనిరోధక శక్తికి ఈ మూడు తప్పనిసరి…
