NTV Telugu Site icon

ఉస్మానియాలో తొలి హోమోగ్రాఫ్ట్ స‌ర్జ‌రీ…

హైద‌రాబాద్‌లోని ఉస్మానియా ఆసుప‌త్రితో ఓ అరుదైన స‌ర్జ‌రీ జ‌రిగింది.  కాలిన గాయాల‌తో బాధ‌ప‌డుతున్న న‌వీన్ అనే యువ‌కుడికి హోమో గ్రాఫ్ట్ స‌ర్జ‌రీ చేశారు.  తెలుగు రాష్ట్రాల్లో మొట్ట‌మొద‌టిసారి ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ సేవ‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు.  చ‌నిపోయిన‌వారి స్కిన్ తీసుకొని 45 రోజులపాటు ప్రాసెస్ చేసిన త‌రువాత హోమోగ్రాఫ్ట్ చేస్తారు.  కాలిన గాయాల‌పై స్కిన్‌తో స‌ర్జ‌రీ చేస్తారు.  ఇప్ప‌టికే ఉస్మానియా ఆసుప‌త్రిలో స్కిన్ బ్యాంక్ కోసం ఇద్ద‌రి నుంచి చ‌ర్మాన్ని సేక‌రించిన‌ట్టు వైద్యులు తెలిపారు.  ఉస్మానియాలో చేసిన ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం కావ‌డంతో కాలిన గాయాల‌తో బాధ‌ప‌డే వారికి భ‌విష్య‌త్తులో హోమోగ్రాఫ్ట్ స‌ర్జ‌రీ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.  

Read: వైర‌ల్‌: కేఫ్‌లో వ‌ర్క‌ర్ మాప్ డ్యాన్సింగ్‌… చివ‌ర్లో ట్వీస్ట్‌…