Site icon NTV Telugu

Green Corridor: జాతీయ రహదారులపై హెచ్ఎండిఏ పూలబాటలు

Green Corridor

Green Corridor

సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరంగల్, నాందేడ్ నేషనల్ హైవే లపై రూ.18.61 కోట్ల వ్యయంతో పూలబాటలు పూర్తి చేసింది హెచ్ఎండిఏ. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నేపధ్యంలో వరంగల్ నేషనల్ హైవే(163) వెంట గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ హైవే వెంట గ్రీనరీ పెంపుదల బాధ్యతలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావుకు సూచించారు. తొలి దశలో వరంగల్ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను 5.5 కోట్ల అంచనాలతో దాదాపు 30 కిలోమీటర్ల పొడవున ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ పర్యవేక్షణలో పూర్తి అయ్యాయి. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” వరంగల్ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులు పూర్తి కావడంతో వరంగల్ రహదారి వెంట అకు పచ్చని అందాలు అందరికీ కనువిందు చేస్తున్నాయి.

Also Read:ISRO Chief: చంద్రయాన్-3 క్రాఫ్ట్ సిద్ధం.. ఈ ఏడాది మధ్యలో ప్రయోగం!

పచ్చదనం పరిమళాలు పట్టణాలకే పరిమితం కాకుండా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తున్నది. మండు వేసవిలోనూ పచ్చదనంతో, పూలవనాలతో హైదరాబాద్ కు వచ్చే నేషనల్ హైవే మార్గాలు ప్రజానీకానికి కంటి ఇంపుగా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి అనుసంధానంగా ఉన్న నేషనల్ హైవేలు స్టేట్ హైవేల సుందరీకరణ (బ్యూటీఫికేషన్) లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కీలక పాత్రను పోషిస్తున్నది. ప్రజల మనోభావాలకు, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్న కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా భవిష్యత్తుతరాలకు పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికాబద్ధంగా విరివిగా పచ్చదనాన్ని (గ్రీనరీ) పెంచి పోషిస్తున్నది.

Also Read: British Envoy: దెబ్బకు దెబ్బ కొట్టిన భారత్‌.. బ్రిటన్ హైకమిషన్‌ బయట బారికేడ్లు తొలగింపు

వరంగల్ నేషనల్ హైవే(NH-163) వెంట ప్రస్తుతం యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” గ్రీనరీ ని జనగామ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పురపాలక శాఖను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా గ్రీన్ కారిడార్ ను తలపించేలా పచ్చదనాన్ని పెంచి పోషించాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖను నిర్దేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు లోబడి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్విoద్ కుమార్ పర్యవేక్షణలో హెచ్ఎండిఏ యుద్ధ పాతిపదికన ఈ పనులను పూర్తి చేసింది.

Also Read: Teacher Beaten By Parents: ఉపాధ్యాయుడిని చితక్కొట్టిన పేరెంట్స్.. కారణమేంటంటే..

సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో అమలు అవుతున్న ‘‘తెలంగాణకు హరితహారం”కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్), వరంగల్ నేషనల్ హైవే(NH-163)వెంట జనగామ వరకు దాదాపు 15.04 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ రూపొందించిన ‘‘మల్టీలేయర్ ప్లాంటేషన్” అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే 15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, 3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తి అయ్యాయి. శ్రీశైలం హైవే (NH-765) వెంట శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మహేశ్వరం వరకు 18 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహణ. కర్నూలు హైవే (NH-44) వెంట అరాంఘర్ నుంచి షాద్ నగర్ వరకు 25 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ హెచ్ఎండిఏ నిర్వహించింది. రాజీవ్ రహదారి స్టేట్ హైవే (SH-1) వెంట శామీర్ పేట నుంచి గజ్వేల్ వరకు దాదాపు 39 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ నిర్వహించింది.

Also Read:Ghmc: గ్రీన్ హైదరాబాద్ దిశగా అడుగులు.. 23 అంశాలకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్

హెచ్ఎండిఏ గ్రీనరీపై గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్.హెచ్.ఏ.ఐ) అధ్యయనం చేసింది. నాందేడ్ నేషనల్ హైవే (NH-161) వెంట హెచ్ఎండిఏ మల్టీ లేయర్ ప్లాంటేషన్ తో పచ్చదనాన్ని పరిమళింప చేస్తున్నది. కంది క్రాస్ రోడ్స్ (చౌరస్తా) నుంచి రామ్ సాన్ పల్లె వరకు 32.77 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ 3.57 కోట్ల వ్యయంతో సెంట్రల్ మిడెన్, ఎవెన్యూ ప్లాంటేషన్ పనులు చేసింది. కాగా, హైదరాబాద్ – వరంగల్ హైవే గ్రీన్ కారిడార్ గా మారుతోంది.

Exit mobile version