విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు ఊహించని అవమానం జరిగింది. అశోక్ గజపతిరాజును కొబ్బరి కాయ కూడా మంత్రి వెల్లం పల్లి కొట్ట నివ్వకుండా రచ్చ చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు… ఆందోళనకు దిగారు. శిలా ఫలకం బోర్డు ను తొలగించే ప్రయత్నం చేశారు పూసపాటి అశోక్ గజపతి రాజు.
ఈ సందర్భంగా.. అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ… ఘటన జరిగి ఏడాది అవుతున్న ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని… ఏడాదిలో గుడి కట్టి తీరుతం అని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగక పోవడం దారుణమని ఫైర్ అయ్యారు. ఆధారాలును తారుమారు చేయడానికి ఇంత లేట్ చేసారని.. ఆలయం ధర్మ కర్త కు కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహించారు. గుడికి విరాళం ఇస్తే నా మొహంపై విసిరి కొట్టారని… భక్తులు విరాళాలు తిరస్కరించడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం హయాంలో వందలాది ఆలయాలు ధ్వంసం జరిగాయని ఫైర్ అయ్యారు.
