Site icon NTV Telugu

ఐబీ హెచ్చరికలు.. ఢిల్లీలో హై అలర్ట్

దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.. దసరా, దీపావళి పండగల సందర్భంగా దేశ రాజధానిలో తీవ్రవాదుల దాడులు జరగవచ్చని ఢిల్లీ పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.. దీంతో.. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు. ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.. ఢిల్లీ పోలీస్ కమీషనర్ రాకేష్ ఆస్తానా నేతృత్వంలో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమయంలో ఐబీ హెచ్చరికలపై చర్చించారు.. తీవ్రవాదులు దాడులకు స్థానిక క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్ల సహకారం తీసుకునే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశారు ఢిల్లీ పోలీసు కమీషనర్.. ఢిల్లీలో ఉన్న సైబర్ కేఫ్ లు, రసాయనాలు అమ్మే దుకాణాలు, పార్కింగ్ స్థలాలు, పాతకార్లు అమ్మే డీలర్లు, చెత్త, తుక్కు సామానాలు అమ్మే ప్రదేశాలపై, వ్యక్తులపై ప్రధానంగా దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీపీ.. దేశరాజధానిలో ఇటీవల వివిధ ప్రాంతాల్లో అద్దెకు వచ్చినవారు, ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి పేరుతో ఉన్నవారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version