తన తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తానని టాలీవుడ్ హీరో నాని సంచలన ప్రకటన చేశారు. నేడు టక్ జగదీష్ ట్రైలర్ ఈవెంట్ సందర్బంగా నాని ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘టక్ జగదీష్ విడుదల విషయంలో నన్ను బయటి వాడిలా చూడటం బాధ కలిగించింది. బయట పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమా థియేటర్ కు వెళ్లకపోతే ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు నన్ను నేనే బ్యాన్ చేసుకుంటానని’ నాని ఆవేదన వ్యక్తం చేశారు.
నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన నాని ఈ సంచలన ప్రకటన చేశారు. అయితే నాని కొద్దిరోజులుగా ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలనీ గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే నిర్మాతల అభిప్రాయానికే తలొగ్గిన నాని.. డిస్టిబ్యూటర్లను సైతం క్షమించమని కోరారు. అయితే తన తదుపరి సినిమాను కచ్చితంగా థియేటర్ లోనే తీసుకొస్తానని, లేకుంటే నన్ను నేనే బ్యాన్ చేసుకుంటానని నాని అనడంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి.
