ఫిట్‌నెస్ కోసం గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటారు. ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, గంటల తరబడి వర్కౌట్ చేస్తే దాని ప్రభావం బెడ్‌రూమ్ పై పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తే శరీరంలో హార్మోన్స్ లెవల్స్ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
Read: మారని పాక్ వైఖరి… ఇండియా విమానాలకు నో…
ముఖ్యంగా తొడ కండరాలు బలంగా ఉండాలని, మజిల్స్ కనిపించాలని చెప్పి దానికి సంబంధించిన వర్కౌట్ చేస్తుంటారు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా, మజిల్స్ బలంగా మారెకొద్ది టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రభావం తగ్గిపోతుంది. ఫలితంగా కోరికలు తగ్గిపోతుంటాయి. ఇది ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శృంగారం మనిషి జీవనంలో ఒక భాగం. దానిని దూరం చేసుకోవడం వలన శారీరకంగా ఫిట్‌గా కనిపించినా మానసికంగా బలంగా ఉండలేరని నిపుణులు చెబుతున్నారు.