NTV Telugu Site icon

పసరు కోసం పోటెత్తిన జనం… కనిపించని సోషల్ డిస్టెన్స్ 

నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నంలో ఆయుర్వేద మంద‌కు ప్ర‌జ‌లు పోటెత్తారు.  ఒక్క‌సారిగా జ‌నం పోటెత్తడంతో తోపులాట జరిగింది.  తోపులాట జ‌ర‌గ‌డంతో ఆయుర్వేద మందును నిలిపేశారు.  మందు కోసం క‌నీసం 50వేల మంది వ‌ర‌కు వస్తార‌ని అంచ‌నా వేశారు.  అయితే, పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లిరావ‌డంతో ఒక్క‌సారిగా తోపులాట జరిగింది. క‌రోనా సోకిన రోగులు అంబులెన్స్ లో అక్క‌డికి వ‌స్తుండ‌టంతో మాములు ప్ర‌జలు ఆందోళ‌న చేశారు.  జ‌నాలు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డంతో మందు పంపిణీవ‌ద్ద సోష‌ల్ డిస్టెన్స్ క‌నిపించ‌లేదు.  ఇక కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ కావ‌డంతో ఈరోజు ఆయుర్వే మందు పంపిణీని నిలిపేశారు.   ఈ పంపిణీపై సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.  ఆయుర్వద మందుకు శాస్త్రీయ‌త ఉన్న‌దా,  ఒక‌వేళ శాస్త్రీయ‌త ఉంటే ప్ర‌భుత్వం త‌ర‌పున పంపిణీ చేయ‌డానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనే దానిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.