NTV Telugu Site icon

వాతావరణశాఖ హెచ్చరిక.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు సాయంత్రం అయ్యిందంటే చాలు దంచికొడుతున్న వానలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం.. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. రేపు అక్కడకక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది. మరోవైపు.. ఈ నెల 6వ తేదీన ఉత్తర, మధ్య బంగా‌ళా‌ఖా‌తంలో అల్పపీ‌డనం ఏర్పడే అవకాశం ఉందని.. వీటి ప్రభా‌వంతో రాష్ట్రంలో శని‌వారం అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉందంటోంది వాతావరణ కేంద్రం..