అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. అనంతపురంతో పాటుగా కదిరి, పుట్టపర్తిలో కూడా భారీగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని చిత్రావతి, బుక్కపట్నం చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నది. చెరుపులు పూర్తిస్తాయిలో నిండిపోవడంతో అటువైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిత్రావతికి భారీగా వరదనీరు చేరడంతో పుట్టపర్తి బ్రిడ్జిపైన ప్రవహిస్తోంది.
Read: స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకీ నెంబర్ వన్ ర్యాంకు
దీంతో పుట్టపర్తి-కర్ణాటక నాగేపల్లికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక తెల్లవారుజాము నుంచి మడకశిరలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో మడకశిర పట్టణం జలమయం అయింది. కదిరిలో కురుస్తున్న వర్షానికి ఎర్రదొడ్డి గంగమ్మ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.