స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకీ నెంబర్‌ వన్‌ ర్యాంకు

దేశ వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. ఇండియన్ పోలీస్ ఫౌండే షన్.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే-2021 విడుదల చేసింది. స్మార్ట్ పోలీ సింగ్ పై నివేదిక ఇచ్చింది. ప్రజలతో సంబంధాలు, సహకారం, సాంకేతికత, చట్టబద్ధత, అవినీతి అంశాలపై సర్వే నిర్వహించింది. 2014 డీజీపీల స‌మ్మేళ‌నంలో స్మార్ట్ పోలిసింగ్ పద్ధతులను పాటించా లని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పిలుపునకు స్పందించి స్మార్ట్ పోలిసింగ్‌ పై అన్ని రాష్ట్రాల్లో ఇండి య‌న్ పోలీస్ ఫౌండేష‌న్ స‌ర్వే చేపడుతుంది. పలు అంశాల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ స్థానం లభించాయి. స్మార్ట్ పోలీసింగ్ అన్ని అంశాల్లో ఏపీకి తొలిస్థానం, తెలంగాణకు రెండోస్థానం వచ్చా యి. పోలీసు సెన్సిటివిటీ, సత్ ప్రవర్తనలో తెలంగాణ పోలీసు కు మొదటి స్థానం దక్కింది. ఫ్రెండ్లీ పోలీసింగ్, సాంకేతికతలో ఏపీకి తొలిస్థానం లభించింది.

ఇటీవల ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ దేశంలోనే పోలీసింగ్, ప్రజా భద్రతలో అత్యుత్తమ పనితీరు పరంగా ఉత్తమ డీజీపీగా ఎంపిక య్యారు.రాష్ట్రంలోని పోలీసు బలగాల్లోని వివిధ విభాగాల్లో సాంకేతిక సంస్కరణలు చేపట్టి గుర్తింపు పొందారు. స్కోచ్, ఫిక్కీ, ఎన్‌సీఆర్‌బి అనే మూడు జాతీయ సంస్థల నుండి ఒకే రోజు అవార్డులు అందు కొన్న దేశంలో ఏకైన పోలీస్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ రికార్డు సృష్టించింది. తమ శాఖ అందించిన సేవలకు గాను ఈ అవార్డులు దక్కాయని గౌతం సవాంగ్ చెప్పారు.

Related Articles

Latest Articles