NTV Telugu Site icon

Heavy Rains: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఈదురు గాలులతో జోరు వాన

Tamilnadu Rains

Tamilnadu Rains

హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే వర్షం మొదలైంది. జంట నగరాలు భారీ వర్షానికి తడిచి ముద్దైంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, అత్తాపుర్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, అమీర్ పేట, సైదాబాద్, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది. గరంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్నారు.
Also Read:LSG vs PBKS: లక్నో చేతిలో పంజాబ్ కింగ్స్ ఘోర పరాజయం

గ‌త ముడు రోజులుగా కూరిసిన వ‌డ‌గండ్ల వాన రైతుల‌ను పూర్తిగా నీటిముంచింది. కొత‌కు వ‌చ్చిన వ‌రి పంట నేల‌రాలి పోయింది. కోనుగోలు కేంద్రాల్లోని వ‌రి ధాన్యం నీటి మునిగి త‌డిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో రైతులు వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు.

Show comments