గత మూడు రోజులుగా భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షాలకు రోడ్లు నీటమునిగాయి. ఇక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఇక గండిపేటకు భారీగా వరద నీరు చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గండిపేటకు పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మూసీ పరివాహ ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అంబర్‌పేట్- మూసారాంబాగ్ వంతెన నీటమునిగింది. పరివాహ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read: మా ఆధీనంలోనే ఉంది… వారివి బూటకపు మాటలే…!!