NTV Telugu Site icon

Heat Waves: మార్చిలోనే దంచి కొడుతున్న ఎండలు

Heat Waves

Heat Waves

తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రలలో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాలలో మార్చి నెలలోనే ఎండ దంచి కొడుతోంది. మార్చి రెండో వారంలోనే వేసవి తాపం ఎక్కువైంది. మార్చిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పచ్చదనం ఉట్టిపడే కేరళలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి.

Also Read: Vidya Balan: ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే..
ఎండల తీవ్రత కారణంగా గోవాలో పాఠశాలలకు ఒంటిపుటే నిర్వహిస్తున్నారు. గోవాలో గత రెండు రోజులుగా ఎండ వేడి పెరిగింది. వేసవిలో ఎండ 45 డిగ్రీలు దాటితేనే జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. రాబోయే రోజుల్లో వేడి గాలులు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో మార్చిలోనే 50 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది.

కేరళ రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు మించవు. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Mlc Kavitha: బై బై మోదీ.. కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు..

మరోవైపు కేరళ వేడి గాలుల ప్రభావం రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడుపై కూడా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరుగుతోబంది. ఎండ వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. 40 డిగ్రీల సిల్సీయస్ అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతుంది. పెరుగుతున్న వేడి తీవ్రతలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత తరచుగా తగినంత నీరు త్రాగాలి. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.