Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Happy Birthday Mahendra Singh Dhoni

హ్యాపీ బర్త్ డే : మహేంద్ర సింగ్ ధోని..!

Published Date :July 7, 2021 , 2:47 pm
By Manohar
హ్యాపీ బర్త్ డే : మహేంద్ర సింగ్ ధోని..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ రోజు తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. భారత దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన కెప్టెన్ గా అలాగే ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోపిలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించాడు ధోని.

7 జులై 1981 రాంచి లో జన్మించ్చిన ధోని 23 డిసెంబర్ 2004లో భారత జట్టు తరపున వన్డే అరంగేట్రం చేసాడు.ధోని జట్టులోకి వచ్చిన మొదట్లో తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోలేదు. 2005 లో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక ఆ తర్వాత నుండి అతను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇక అదే ఏడాది శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 145 బంతుల్లో 183 పరుగులు బాది అప్పటివరకు భారత్ తరపున వన్డే లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ ప్రదర్శనతో అదే సంవత్సరం టెస్ట్ మ్యాచ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2007టీ 20 ప్రపంచ కప్ కు ముందు అనుకోకుండా భారత పగ్గాలు అందుకున్న ధోని ఆ టోర్నమెంట్ చివరి మ్యాచ్ల్లో భారత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై తన తెలివితో విజయంసాధించి జట్టుకు ట్రోఫీ అందించి తానేంటోనిరూపించుకున్నాడు.

ఇక 2008, 2009 లోధోని వరుసగా ఐసీసీ వన్డే ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. అయితే అప్పటివరకు ఈ అవార్డు ను రెండుసార్లు అందుకున్న ఏకైక ఆటగాడు ధోనీనే. కెప్టెన్ గా ఎంపికైన తర్వాత నుండి జట్టును విజయ పథంలో నడిపిస్తున్న ధోని 2011 లో భారత 28 ఏళ్ళ కలను నెరవేర్చాడు. 2011 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో 79 బంతుల్లో 91 పరుగులు తో నాట్ ఔట్ నిలిచి భారత్ కు ప్రపంచ కప్ అందించాడు. అయితే అప్పటికే బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నా ధోని ఆ మ్యాచ్ చివర్లో కొట్టిన సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయేఘటన.

1983 లో కపిల్ దేవ్ తర్వాత మళ్ళీ 28 ఏళ్లకు ఈ టైటిల్ అందుకున్న రెండో భారత కెప్టెన్ ధోని. ఇక ఆ తర్వాత మరో రేడు సంవత్సరాలకి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించని రికార్డును ధోని సాధించాడు. 2013 ఛాంపియన్ ట్రోఫీ విజయం తో క్రికెట్ చరిత్రలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచ్చాడు ధోని. కేవలం భారత జట్టునే కాకుండా ఐపీఎల్ లోతన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు సార్లు టైటిల్ అందించాడు.

అటువంటి ధోని ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నమెంట్ల ఓటముల తర్వాత 2017 జనవరి లో వన్డే మరియు టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఇక అప్పటినుండి ధోని కెరియర్ పై అనుమానాలు మొదలయ్యాయి. అలాగే తన రిటైర్మెంట్ ప్రశ్న వెలుగులోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే 2019 సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత నుండి జట్టుకి దూరంగా ఉన్నాడు. అలాగే బీసీసీఐ తమ కాంట్రాక్టు లో కూడా ధోనికి చోటు కల్పించలేదు.

దాంతో అందరి అనుమానాలు ఇంకా బలపడ్డాయి. కానీ ధోని మాత్రం ఈ విషయం పై ఏం స్పందించకుండా అనూహ్యంగా గత ఏడాది ఆగస్టు లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో ధోని ఆడగా అతని చెన్నై జట్టు పూర్తిగా విఫలం అయ్యింది. ఇక ఈ ఏడాది జరుగ్గుతున్న ఐపీఎల్ సీజన్ లో ధోని జట్టు రాణిస్తున్న కరోనా కారణంగా ఆ లీగ్ వాయిదా పడింది. దాంతో మళ్ళీ ధోని ఎప్పుడెప్పుడు గ్రౌండ్ లోకి అడుగు పెడతాడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dhoni
  • happy birthday
  • happy birthday mahendra singh dhoni
  • mahendra singh dhoni
  • MSD

తాజావార్తలు

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

  • Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..

  • Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

  • AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions