Site icon NTV Telugu

వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా..

వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం… వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్‌.. టెక్స్‌టైల్స్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్రాలు వ్యతిరేకించాయి.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఉత్తరులు కూడా వెళ్లాయి.. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు వస్త్రాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 12కి పెంచడాన్ని వ్యతిరేకించాయి..

Read Also: 50కే లిక్కర్‌..? ప్రతీ కుటుంబానికి 2 లక్షలు మిగులుతాయి..!

ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అధ్యక్షతన, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ యొక్క 46వ సమావేశం నిర్వహించారు.. వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే ప్రతిపాదనను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు.. వస్త్రాలపై వస్తు, సేవల పన్ను పెంపునకు వ్యతిరేకంగా వ్యాపారులు చేస్తున్న నిరసనకు ఢిల్లీ ప్రభుత్వం మద్దతిస్తోందని, జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని డిసెంబరు 30న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలపగా.. జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంపునకు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న నిరసన న్యాయమైనదేనని.. తమ ప్రభుత్వం పన్ను రేట్లను తక్కువగా ఉంచడానికి అనుకూలమని ప్రకటించారు.. మరోవైపు.. వస్త్రాలపై జీఎస్టీ పెంచితే.. రైతుల తరహాలో.. చేనేత కార్మికుల కూడా ఆందోళన చేస్తారని.. వారికి తాము అండగా ఉంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే.

Exit mobile version