NTV Telugu Site icon

ఐపీఓ: ప్రైవేట్ సంస్థ‌లు దూకుడు… మంద‌గించిన పబ్లిక్ రంగం…

క‌రోనా త‌రువాత ప్రైవేట్ సంస్థ‌లు దూకుడుమీదున్నాయి.  స్టాక్ మార్కెట్ల‌లో సుమారు 50 కి పైగా కంపెనీలు ఐపీఓకి వ‌చ్చాయి.  రూ.1.1 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించాయి.  ప్రైవేట్ సంస్థ‌ల ఐపీఓలు భారీ ఎత్తున నిధుల‌ను స‌మీక‌రిస్తుండ‌టంతో వ‌చ్చే ఏడాది కూడా ఇదే దూకుడు ఉండేలా క‌నిపిస్తోంది.  ప్రైవేట్ కంపెనీలు దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుంటే, ప్ర‌భుత్వ‌రంగ కంపెనీలు అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డం లేదు.  ఈ ఏడాది కేవ‌లం రెండు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు మాత్ర‌మే ప‌బ్లిక్ ఇష్యూకి వ‌చ్చాయి.  కేవ‌లం రూ. 5,500 కోట్లు మాత్ర‌మే స‌మీక‌రించ‌గ‌లిగాయి.  2010 లో ఐపీఓల ద్వారా స‌మీక‌రించిన మొత్తంలో స‌గం వాటా ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌దే ఉన్న‌ది.

Read: గుడ్‌న్యూస్‌: క‌రోనా వేరియంట్ల క‌ట్ట‌డికి లామా ఔష‌దం…

 2017 లో మూడో వంతు నిధులు ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు స‌మీక‌రించాయి.  అయితే ఈ ఏడాది రెండు కంపెనీలు మాత్ర‌మే ఐపీఓల‌కు వెళ్ల‌డంతో నిధుల స‌మీక‌ర‌ణ త‌గ్గిపోయింది.  ఎల్ఐసీని ఐపీఓకి తీసుకురానున్నామ‌ని గ‌తేడాది ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు.  అన్ని ర‌కాల కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేందుకు ఇన్వెస్ట‌ర్లు సిద్ంగా ఉన్నారని, ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.