NTV Telugu Site icon

‘గూగుల్ క్రోమ్’ ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ హెచ్చరిక మీకే..

గూగుల్ సంస్థ రూపొందిన గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను పెద్ద సంఖ్యలోనే వినియోగిస్తున్నారు.. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి పనిచేసే దీనిని 2008లో మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం తయారు చేశారు. తర్వాత లినక్సు, మాక్ ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా పనిచేసేలా రూపొందించారు. దీనిని ఆధారంగా చేసుకుని గూగుల్ క్రోమ్‌ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టంను తయారు చేసింది.. ఇతర వెబ్‌ బ్రౌజర్లు ఉన్నా.. గూగుల్‌ క్రోమ్‌కు మాత్రం మంచి ఆధరణ ఉంది.. అయితే.. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్లకు తాజాగా వార్నింగ్‌ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌ఐ-ఇన్‌) గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్ వినియోగదారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. CERT-In మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) క్రింద పనిచేస్తుంది. యూజర్స్‌ సెల్ఫీల విషయంలో బ్రౌజింగ్ ప్లాట్‌ఫారమ్ గూగుల్ క్రోమ్ అత్యంత ప్రమాదకరమని CERT-In విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. ఎందుకంటే, గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో హ్యాకింగ్‌కు దారితీసే అనేక ప్రమాదాలను ప్రభుత్వం గుర్తించింది.. ప్రభుత్వ సలహాల ప్రకారం, వినియోగదారులు వెంటనే గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Read Also: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదం.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా కన్నుమూత..

ఒక వేళ యూజర్లు వెంటనే గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయకపోతే, దానిని రిమోట్‌గా హ్యాక్ చేసే ప్రమాదం లేకపోలేదు అని హెచ్చరిస్తోంది. గూగుల్‌ క్రోమ్‌ ద్వారా మీ సున్నితమైన వ్యక్తిగత వివరాలు దొంగిలించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ బృందం కూడా క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయడానికి గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను విస్తృతంగా ఉపయోగించే వ్యక్తులను ప్రభుత్వం హెచ్చరించింది. హ్యాకర్లు వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందవచ్చని, కంప్యూటర్‌లో మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేయవచ్చని వాచ్‌డాగ్ పేర్కొంది. ఇక, దానిలోని లొసుగులను పూడ్చడానికి మరియు రిమోట్‌గా వినియోగదారుల కంప్యూటర్‌లను హ్యాకర్లు నియంత్రించకుండా నిరోధించడానికి.. ప్రైవసీని నిర్ధారించడానికి 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం తెలిపింది.